నెల్లూరు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ సాధించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ పేర్కొన్నారు. స్థానిక 15 వ డివిజన్ టిడిపి అభ్యర్థిని కమ్మ కళ్యాణి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి హయాంలోనే రోడ్లు, పార్కులు, పాఠశాలలు, వైద్యశాలలు, వ్యవసాయం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. గత 3 సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ప్రజలపై అన్ని రకాల పనులు బాదుడు పెంచిందన్నారు. సామాన్య మానవుని జీవిత గమనం అగమ్య గోచరంగా మారిందన్నారు. వైకాపా పాలన పై ప్రజలు విసుగెత్తి పోయారని, రానున్న ఎన్నికలలో టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో అభ్యర్థిని కమ్మ కళ్యాణిని బలపరుస్తూ జోరు వానలోనూ ప్రచారంలో హుషారుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇంచార్జి కమ్మ చౌదరి మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.