Home తెలంగాణ మద్యం షాపు వద్దంటూ ధర్నా

మద్యం షాపు వద్దంటూ ధర్నా

304
0

పెద్దపల్లి డిసెంబర్ 01

రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన లో మద్యం షాపు ఏర్పాటు చేయోద్దని డివిజన్ ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువకులు బుధవారం ధర్నాకు దిగారు. 11వ డివిజన్ లో నూతనంగా మద్యం దుకాణాన్ని బుధవారం ప్రారంభించేందుకు ప్రొద్దున సమయంలో వ్యాన్‌ లో మద్యాన్ని తీసుకురాగా మహిళలు, విద్యార్థులు యువకులు వ్యాన్‌ను అడ్డుకొని ధర్నాకు దిగారు. రామాలయం టెంపుల్ చర్చి దుర్గాదేవి టెంపుల్ అంబేద్కర్ లైబ్రరీ గల నివాస గృహాలు చెంత మద్యం షాపు పెట్టొద్దని ప్రశాంత వాతావరణాన్ని జన వాసాన్ని పాడు చేయవద్దని నినాదాలు చేశారు. మద్యం షాపు పెట్టి స్థానిక డివిజన్ ప్రజలను ఇబ్బందులు గురి చేయడం మానుకోవాలన్నారు. వెంటనే దీనిపై జిల్లా అధికారులు స్పందించి 11వ డివిజన్ జ్యోతి నగర్ లో మద్యం షాపును నిలిపివేయాలని అన్నారు. లేదంటే పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, గంగాధర లచ్చమ్మ, కన్నురి లక్ష్మి, ఇనుముల రాజమ్మ. అనుముల కళావతి, వనిత, సుజాత, స్థానిక డివిజన్ యువ నాయులు వడ్డేపల్లి క్రాంతి కుమార్,దాసరి విజయ్, సాతూరి శ్రీనివాస్,సురేందర్, నాతరి మల్లేష్, గోషిక జగన్, గంగాధర సుమన్, మధు, అభిలాష, పల్లె రమేష్, రెనుకుంట్ల నరేందర్, పోతరపు రాము. డివిజన్ వాసులు పాల్గొన్నారు.

Previous articleఇళ్ల పథకం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దు ఏపీ ప్రభుత్వానికి ఊరట … పేదల ఇళ్ల నిర్మాణానికి ఇక మార్గం సుగమం
Next articleపోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here