Home Uncategorized రక్షణ మంత్రిత్వ శాఖ ప్యానెల్‌లో ధోనీకి చోటు

రక్షణ మంత్రిత్వ శాఖ ప్యానెల్‌లో ధోనీకి చోటు

341
0

న్యూఢిల్లీ సెప్టెంబర్ 17
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మరో గౌరవం లభించింది. అయితే, ఇది ఈసారి క్రికెట్ ప్రపంచానికి బయట. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) మరింత సమగ్రంగా ఉండేలా సమీక్షించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 15 మందితో కూడిన ప్యానెల్‌లో ధోనీకి చోటు లభించింది. ధోనీకి ఇప్పటికే లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవ హోదా ఉంది. ధోనీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఆర్మీతో కలిసి చాలా రోజులు గడిపాడు. పారాచూట్ రెజిమెంట్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

Previous articleసమాజసేవలో స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమవర్గాలు ముందు ఉండాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
Next articleచిన్నారి హత్యాచార నిందితుడి ఆత్మహత్యపై హైకోర్టులో పిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here