యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసగా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ నగేష్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేయించడంతో అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మైకును నేలకు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పోడియం ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేసారు. గ్రామాల్లో జరిగే ప్రారంభోత్సవాలకు కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వారు నిరసన వ్యక్తి చేసారు.నిధుల మంజూరు లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు గెలిసిన మండలాల్లో నిధులు కేటాయించడం లేదంటూ అందోళనకు దిగారు.