Home ఆంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి డిఐజి దిశానిర్దేశం

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి డిఐజి దిశానిర్దేశం

231
0

తిరుపతి

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా సోమవారం దిశానిర్దేశం చేశారు. ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. శేషాచలం అడవిలోని ఎర్రచందనం వృక్షాలు కలిగి ఉన్న ప్రాంతాలను మ్యాప్ ల ద్వారా గుర్తించారు. స్మగ్లర్లు ఆ ప్రాంతాలకు చేరుకునే మార్గాల వద్ద నిఘా ఏర్పాటుకు సంబంధించిన సూచనలు చేశారు. ఇతర జిల్లాల పోలీసు విభాగాల సహకారంతో ఇది వరకే చేపట్టిన ఆపరేషన్ ల ఫలితాలు గురించి సమీక్షించారు. అడవుల్లో చేపట్టాల్సిన భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, డీస్పీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleతెలంగాణ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఇతర రాష్ట్రాల్లోని సింగరేణితో ఒప్పంద థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా సింగరేణి సి.ఎం.డి. ఎన్. శ్రీధర్
Next articleప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిష్కారించాలి… –జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here