హైదరాబాద్ నవంబర్ 17
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని సీఎం తన లేఖలో కోరారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని వినతి చేశారు. 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు. వచ్చే రబీలో రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలి. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వట్లేదు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదు అని సీఎం లేఖలో పేర్కొన్నారు.