జగిత్యాల అక్టోబర్ 25
సేవాభారతి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో గత 29 సం.రాలుగా నిర్వహిస్తున్న శ్రీ వాల్మీకి ఆవాసం లో చదువుతున్న 42 మంది ఆవాస విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు (యశస్వి ఎంటర్ప్రైజ్,జగిత్యాల) స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేశారు.శ్రీనివాస్-మంగ దంపతుల కుమారుడు యశస్వి పుట్టిన రోజు సందర్భంగా ఆవాసం లో వేడుకలు నిర్వహించి విద్యార్థుల కు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భముగా ఆవాసం అధ్యక్షులు జిడిగే పురుషోత్తం మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో గత 29 సం.రాలుగా గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా వసతి,భోజన సౌకర్యం కల్పిస్తూ సంస్కారం తో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఆవాసం విద్యార్థులు తమ జీవితం లో స్థిరపడి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆవాసం పనిచేస్తుందన్నారు. ఆవాస నిర్వహణకు ఎంతోమంది దాతలు తమ సహాయ సహకారాలను అందిస్తున్నారని వారందరికీ ఆవాసం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేసిన శ్రీనివాస్ దంపతులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆవాస సభ్యులు డా”గుండేటి ధనుంజయ,ఆవాస ప్రముఖ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.