కోరుట్ల నవంబర్ 30
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం అభినందనీయమని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు ఆన్నారు. మంగళవారం.మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐలాపూర్ గ్రామానికి చెందిన బొల్లేపల్లి రాజ లింగం గౌడ్ సుమారు 300 మంది విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు హాజరై విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.,ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు,ఆనంతరం దాత రాజలింగం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సాహం అందించే విధంగా ఉండాలన్న ఆలోచనతో తమ కుమారుల సలహా మేరకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిడుగు రాధ సందయ్య ,ప్రాధానోపాధ్యాయుడు అక్కినపల్లి వెంకటరమణ, బండి శ్రీనివాస్, దీకొండ రాజ నరసయ్య,మర్రిపెల్లి చక్రవర్తి గౌడ్ బండి మురళి, తదితరులు పాల్గొన్నారు..