ఎమ్మిగనూరు
నియోజవర్గం లోని శ్రీ నీలకంటేశ్వర జాతరను పురస్కరించుకొని మహిళ కబడ్డీ క్రీడాకారులకు పట్టణంలోని మేఘన స్పోర్ట్స్ అధినేత వీరారెడ్డి క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీర రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ అంతర్రాష్ట్ర మహిళ కబడ్డీ పోటీలు చాలా చక్కగా జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. అలాగే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి అంతరాష్ట్ర కబడ్డీ పోటీలు మరెన్నో జరిగి అభివృద్ధి చెందాలని క్రీడాకారులకు ఎల్లప్పుడూ మా సహాయం తోడ్పాటు ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రామకృష్ణ, శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ యజమానీ జాలవాడి శివ, మనోజ్, తెర్నేకల్ శివ,లింగ రెడ్డి మరియు మిత్ర బృందం పాల్గొన్నారు