పెద్దపల్లి నవంబర్ 19
పెద్దపల్లి జిల్లా ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని గాంధీనగర్లోని ఎం డి హెచ్ డబ్ల్యూ ఎస్ బాలల సంరక్షణ సంస్థలో భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హాజరై పిల్లలతో కేక్ కట్ చేసి పండ్లు పంపిణిచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక మహిళ భారత ప్రధానిగా పేద వారికి ఎన్నో సేవలు చేశారని ఇందిరా గాంధీ అంటే ఉక్కుమహిళగా ప్రపంచానికి వన్నె తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ముస్తఫా, నాయకులు నగునూరి రాజు, ఫక్రుద్దీన్, నదీమోద్దీన్ గడ్డం శ్రీను, శాంతి తదితరులతోపాటు ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య భూలక్ష్మి, రాజు, రంజిత్ పాల్గొన్నారు