కడప అక్టోబర్30
:దేశంలో 80 శాతం మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ మూడో లేదా నాల్గవ దశలో కానీ డాక్టర్ల వద్దకు వెళ్ళడం లేదని తద్వారా మరణాలకు చేరువవుతున్నారని రొమ్ము క్యాన్సర్ ను మొదటి దశ లోనే నిర్ధారించుకుని తగిన చికిత్స చేయించు కోవటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు నని ఫాతిమా వైద్య కళాశాల వారి పట్టణ ఆరోగ్య శిక్షణా కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బెనజీర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అక్టోబర్ మాసమును రొమ్ము క్యాన్సర్ అవగాహనా మాసంగా ప్రకటించిన దరిమిల ఫాతిమా వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వారు క్యాన్సర్ పైన పూర్తి సమాచారం తో రూపొందించిన కరపత్రాలను స్థానిక అక్కాయపల్లి లోని ఫిమ్స్ పట్టణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పరిసరాలలో ఈ నెల 30 వ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బెనజీర్ మాట్లాడుతూ మన భారతదేశం లో సంవత్సరానికి దాదాపు 20-30 వేల మరణాలకు కారణమవుతూ, నిన్నటి సమాజాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన గర్భాశయ క్యాన్సర్ లను అధికమిస్తూ నేడు రొమ్ము క్యాన్సర్ల ప్రభావం చాలామంది స్రీల పైన పడి జీవితాలను అతలాకుతలం చేస్తూవున్నాయి అని ఈ రొమ్ము క్యాన్సర్ పైన ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ బెనజీర్ కోరారు. తదనంతరం అక్కాయపల్లి పరిసర ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ మెడికల్ సోషియల్ వర్కర్ సుబ్రమణ్యం జూనియర్ వైద్యులు అర్బాజ్, మేఘానాయుడు, నిశ్చల, జియా ఉల్ హక్, మనీషా, మన్షా మనాల్, రుక్సనా, అష్రఫ్, షాహిద్, ఉమర్, జువెరియా 2018 మరియు 2019 సంవత్సరపు వైద్య విద్యార్థులు మరియు సిబ్బంది రమాదేవి, ధనలక్ష్మి, పుష్పలత, తహసీన్,. శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.