Home ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్కులు పంపిణీ బి యస్...

వైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్కులు పంపిణీ బి యస్ నారాయణ రెడ్డి

146
0

కంభం

ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐ. ఏ. హెచ్.వి ఆధ్వర్యంలో శనివారము ఉదయం   ప్రభుత్వ  హాస్పిటల్ నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐ .ఏ .హెచ్ .వి వారి ఆర్థిక సహాయ సహకారాలతో  ఎన్95 మాస్కులు పంపిణీ చేయడము  జరిగిందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో  డాక్టర్ పి శశికాంత్ కుమార్  పాల్గొని మాట్లాడుతూ  గుంపులు- గుంపులుగా ప్రజలు ఒకచోట ఉండకూడదన్నారు. 18 సంవత్సరాలు పైబడిన స్త్రీ, పురుషులు రెండుడోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోవిడ్ 19 వలన సమాజంలోని ప్రజలు  అల్లకల్లోల మయ్యారన్నారు. థర్డ్ వే లాంటి కరోనా రాకుండా ఉండటానికి తట్టుకునేటువంటి  ఎన్ 95 మాస్కులు ముందు జాగ్రత్తగా హాస్పిటల్ సిబ్బందికివ్వడము చాలా ఆనందదాయకమన్నారు. మాస్కులు ధరించండి – కరోనాను పారద్రోలండి అని పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు సద్గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ,  ఐ .ఏ .హెచ్. వి వారికి  హాస్పిటల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కరోనా వ్యాధి కంటికి కనిపించని వైరస్ అది నిర్జీవి అయినా మన శరీరంలోని కంటి పుషుల ద్వారా ముక్కు రంధ్రాల గుండా లోపలికి వెళ్లి ప్రాణం పోసుకుని కరోనా వైరస్ మనిషికి ఇబ్బంది కలిగిస్తోందన్నారు. దీనికి ఒక్క మాస్క్ మాత్రమే సరైన ఉపయోగం అన్నారు. మాస్క్ ధరించని కరోనా వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గాలిలో సంచరిస్తుందన్నారు. అందుకోసం ప్రతి మనిషి తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు. లేనిచో మనకు తెలియకుండానే ఒకరి నుండి మరొకరికి కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నారు.  మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ తరచూ ముఖము, చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు.  జలుబు, దగ్గు, జ్వరము, గొంతునొప్పి లక్షణాలు కలిగిన వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించాలన్నారు. ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వము ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్రే అధికారి బి అనిల్ కుమార్  స్టాఫ్ నర్సులు వీర లంకమ్మ, పద్మ, పోలేరమ్మ,రత్న మాధవి, శానిటేషన్ కాశమ్మ, ఆంధ్ర య్య, సరోజ ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్, ఫార్మసిస్ట్ వి కె రమేష్,యూ డి సి సంగీతరావు, లేబర్ నరేంద్ర రామయ్య,   మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous articleభారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ సస్టెయినింగ్ సోలార్ ఛార్జింగ్ స్టేషన్
Next articleబంగారు గుడిని దర్శించిన టీటీడీ చైర్మన్ దంపతులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here