నెల్లూరు
మానవసేవయే మాధవసేవ సేవా గ్రూప్ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ అధికారులు ఉద్యోగులు సేవాతత్పరత కలిగిన అందరి సహకారంతో హెచ్ఐవి ఎయిడ్స్ చిన్నారుల కేంద్రం న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ కోవూరులో ఉన్న హెచ్ఐవి ఎయిడ్స్ చిన్నారులకు విజయదశమి శుభ సందర్భంగా కొత్త బట్టలు అందచేయడంతోపాటు చిన్నారులచే కేక్ కట్ చేసి స్నాక్స్ చాక్లెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం ఉద్యోగ సంఘ నాయకులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ హెచ్ఐవి చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా రిట్రో వైరల్ డ్రగ్స్ సకాలంలో వాడిస్తూ,మంచి పోషక విలువలు ఉండే ఆహారాన్ని అందిస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో వసతి కల్పించిన ఆశ్రమం నిర్వాహకులు సాల్మన్ ని ఘనంగా అభినందించడం జరిగింది.న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు ప్రతి ఒక్కరు సహాయం చేసి వారిని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఆఫీసర్ గారేపల్లి .విశ్వనాథం, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీనివాసులు , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆర్ ఇందిర, సేవా టీం నిర్వాహకులు ఎ. పరిమళ తదితరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జీవి పుల్లారెడ్డి,యమ్.సుమతి,ఎ. ఉషా, ఎన్.. సైలజ, జి
.విశ్వనాధ్, ఆర్ ఇందిరా, ఎస్కే జలీల్ అహ్మద్, డాక్టర్ ఏడుకొండలు ,డాక్టర్ రమాదేవి, డాక్టర్ వెంకటేష్, ధీరజ్ పి సుశీలమ్మ , జి.బ్రహ్మారెడ్డి, ఎ.సి. సునీల్ కుమార్, యస్.భాను మూర్తి, జి కిషోర్ బాబు, సిహెచ్ కళ్యాణి తదితర సహకరించిన దాతలకు సేవి టీం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.