*ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
మంత్రాలయం అక్టోబర్ 11
కౌతాళం
మహిళలకు వైయస్సార్ ఆసరా పథకం కింద రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. మహిళలను మహారాణులుగా మార్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనాయాడారు.
మహిళ రక్షణే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం దిశ చట్టం అమలు చేస్తుందని
దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే. బాలనాగిరెడ్డి, డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లో వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, దేశాయి కృష్ణ, లక్షి రెడ్డి, ఎంపీపీ అమరేషప్ప,, మబుసాబ్, జెడ్పీటీసీ రాధ ప్రియదర్శిని, తహసీల్దార్ చంద్రశేఖర్, పాల్ దినకర్ గురునాధ్ రెడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు