మంత్రాలయం :
మహిళలకు వైయస్సార్ ఆసరా పథకం కింద రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళలను మహారాణులుగా మార్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనాయాడారు.
మహిళ రక్షణే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం దిశ చట్టం అమలు చేస్తుందని
దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే. బాలనాగిరెడ్డి, డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లో కన్వీనర్ భీమిరెడ్డి వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి విశ్వనాధ రెడ్డి, స్థానిక సర్పంచ్ భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి, వైస్. ఎంపిపి రాఘవేంద్ర ,వార్డు మెంబర్లు వెంకటేష్ శెట్టి జగదీష్ స్వామి, భాస్కర్, వైయస్సార్ సిపి నాయకులు అశోక్ రెడ్డి, వైకాపా కార్యకర్తలు, మంత్రాలయం మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Home ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత పంపిణీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం