ఖమ్మం
నగరంలోని కాల్వవోడ్డు సమీపంలోని మున్నేరు వద్ద శనివారం జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనాల సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై పోలీసు సిబ్బందితో పాటు మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన పరిసరాలలో కలియతిరిగారు. ప్రజలను మున్నేరులో అనుమతించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ దీపాలు, రోడ్లు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులను కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ నీరజ , అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ఏసీపీలు రామోజీ రమేష్ , జనేయులు, రెవెన్యూ , మున్సిపల్, విధ్యుత్ శాఖ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.