Home తెలంగాణ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

126
0

జగిత్యాల, నవంబర్ 23
సారంగాపూర్ మండలం పెంబట్ల  గ్రామం, సారంగపూర్ మండలం నాయకపు గూడెం పరిధిలో పిఎసిఎస్ సెంటర్లను మరియు లక్ష్మీదేవి పల్లి గ్రామం, సారంగపూర్, భీర్పూర్ మండలం కేంద్రం లోని ఐకెపి సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం

కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ జి. రవి మంగళవారం పరిశీలించారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం లోడింగ్ మరియు ఆన్లోడింగ్ లకు సంబంధించిన వివరాలను కేంద్రం నిర్వహకులు, అధికారుల ద్వారా ఆడిగితెలుసుకున్నారు.

కొనుగోలు

కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చిన రైతులతో మాట్లాడుతూ, లోడ్ తో రైస్ మిల్లులకు వెళ్లిన లారీలు తిరిగిరావడంలో అలస్యమవుతుందని రైతులు తెలుపగా, వెంటనే మిల్లుల వద్ద లారీలు ఎక్కువ సమయం నిలువరాదని, వెంటనే అన్ లోడింగ్

పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని డి.సి.ఎస్.ఓ. ను ఫోన్ ద్వారా ఆదేశించారు.  లారీలు వచ్చే లోగా లోడ్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వాతావరణంలో మార్పులు అకాల వర్షాబావ పరీస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని,

టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోని, దాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసమే సెంటర్లను స్వయంగా తనిఖీ చేసి వెంటనే పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని

తెలిపారు.

రైతుల ద్వారా కొనుగోలు కేంద్రాలకు వచ్చే దాన్యం నాణ్యత పరిమాణాలను, తేమశాతం  పరిశీలించి, వ్యవసాయ శాఖ అధికారుల దృవీకరించిన దాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర నిర్వహకులను, అధికారులను

ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలను ఏ విధంగా పాటిస్తూన్నారు, ఎంత విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు మరియు లోడింగ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు

అలస్యం జరగకుండా ట్యాబ్ ఎంట్రీలు జరగాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సజావుగా కొనుగోలు ప్రకీయా పూర్తి చేయాలని, రైతులకు ఇబ్బందులు గురిచేసిన వారు చర్యలకు

బాద్యులవుతారని హెచ్చరించారు.

కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలును వెంటనే తరలించాలని ఆదేశించారు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సెంటర్లో ఉన్న రైతులతో మాట్లాడుతూ రైతులు ధాన్యం ఎప్పుడు తెచ్చారు తేమశాతం ఏ విధంగా

ఉంది వంటి పలు అంశాలను మరియు వారి సమస్యలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమం చివరగా భీర్పూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణ పనులను

పరిశీలించి, పూర్తి నాణ్యత ప్రమాణాలతో ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పిడి డిఆర్డిఎ ఎస్. వినోద్, డి సి ఓ రామానుజాచారి, డి.ఏ.ఓ. పి. సురేష్, ప్రత్యేక

అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Previous articleశ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
Next articleస్టెరిలైజింగ్ క్యూర్ ద్వారా హెచ్ఐవీ నయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here