కామారెడ్డి నవంబర్ 01
కామారెడ్డి జిల్లా రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ రోజుకామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవిన్యూ 20, గ్రామపంచాయతీ 4, పోలీస్ శాఖ 3, సివిల్ సప్లై , గృహ నిర్మాణ, సహకార శాఖలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.