కర్నూలు, అక్టోబరు 06
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అందులో భాగంగా క్యాజువాలిటీ వార్డులో రోగులకు అందుతున్న వైద్యసేవలు పై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు, తదితర వివరాలను సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులతో పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారని, పిల్లలకు అందించాల్సిన వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.