జగిత్యాల సెప్టెంబర్ 30
75 ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి ప్రారంభించారు.ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో డిఆర్ డీఏ ఎస్ బీఎం స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని గురువారం జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వచ్ఛహీ సేవా పేరిట స్వచ్ఛత పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు .జిల్లా గ్రామీణ అభివృద్ధి ,సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛరథం ప్రచారం వలన గ్రామాలలో మరుగుదొడ్ల వినియోగం, తడి, పొడి చెత్త వేరు చేయడం ఆవశ్యకత, ఇంకుడు గుంతల లాభాలు తదితర పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కలిగించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అరుణశ్రీ, జెడ్పి సిఈఓ డిఆర్డీఓ ఏడి పి, ఏపీఎంఎస్ ,ఏపిఎం మరియు ఎస్బిఎం సిబ్బంది పాల్గొన్నారు.