అమరావతి నవంబర్ 22
తాము వెనక్కి తగ్గలేదని, ఆగిపోలేదని మంత్రి బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఇంకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. శాసనసభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం జగన్ పూర్తి
స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజల మనోభావాలు ఏంటి అనేది కూడా సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఎక్కడో ఒక దగ్గర అపోహలు ఉన్నాయని, టీడీపీ దుష్ప్రచారాలు చేసిందని బొత్స విమర్శించారు.రాష్ట్ర ప్రజల అందరి
అభిప్రాయాలు తీసుకుని మళ్లీ ముందుకు వస్తామని తెలిపారు. రైతులకు ఇంకా సమస్య ఎక్కడ ఉందని, వాళ్ల మనసుకు తగ్గట్టు తాము అన్ని చేయలేమన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాడు పర్యటనకు వస్తుంటే.. ఏముంది ఇక్కడ స్మశానం తప్ప
అన్నానని, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని, రోజుకో మాట మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.