Home తెలంగాణ అధైర్య పడొద్దు..అండగా ఉంటాం మంత్రి కేటీఆర్

అధైర్య పడొద్దు..అండగా ఉంటాం మంత్రి కేటీఆర్

107
0

హైదరాబాద్
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

Previous articleహాట్ హాట్ గా టీపీసీసీ భేటీ
Next articleటపాకాయల దుకాణాల స్థల అవరణని పరిశీలించిన తహశీల్దార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here