నంద్యాల
నంద్యాల పట్టణంలో గురువారం నాడు కేంద్ర గిడ్డంగుల వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులకు తెలుగుదేశం పార్టీ మాజీ యమ్ యల్ ఏ భూమ బ్రహ్మానందరెడ్డి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ . కేంద్ర గిడ్డంగుల సంస్థ లొ నిల్వ వుంచ వలసిన బియ్యం రాష్ట్ర ప్రభుత్వం గొపవరం వద్ద ప్రవేటు గిండ్దంగి బాడుగకు తీసుకొని నిల్వ చేస్తున్నారని విమర్శించారు . అందువలన కేంద్ర గిడ్డంగుల సంస్థ లొ హమాలిలకు ఉపాది పోతుందని అన్నారు. రైల్వే స్టెషను నుండి బియ్యం గోపవరం గిడ్డంగు కు. అక్కడ నుండి డీలరు వద్దకు తోలఢం వలన అదనంగా దూరం పెరగడంతో వినియెగ దారులకు అదనంగా బారం పడుతుందని అన్నారు . ఈ విషయం పై తెలుగు దేశం పార్టీ తరపున మాజి శాసన సభ్యుడు భూమా బ్రంహ్మనంద రెడ్డి హమాలీలకు సంఘిబావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సరపరా చేసె బియ్యం ప్రభుత్వ సంస్థ అయిన కేంద్ర గిడ్డంగుల సంస్థ లోనె నిల్వ ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.