బెల్లంపల్లి డిసెంబర్ 01
రూరల్ సీఐ ,నెన్నెల ఎసై లపై జంబి శ్రీనివాస్ , వివిధ పార్టీల నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలని అన్నారు. మంగళవారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తరువాత రోజు కేసు నమోదు చేశామని . మృతిచెందిన యువతి, యువతి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా కొందరు వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడంతో మనస్తాపం చెంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు . కొన్ని రోజుల తర్వాత పోలీసులు రోజు వారిగా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి గుడుంబాతో దొరకడం అతనిని విచారించగా జంబి శ్రీనివాస్ పేరు చెప్పడంతో వెంటనే అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని పేర్కొన్నారు . ఆ సమయంలో జంబి శ్రీని వాస్ తోపాటు అతని భార్య ఇంట్లోనే ఉన్నారని , పోలీసులు ఫోన్లో వీడియో చిత్రీకరించారని అన్నారు. మగవారు లేని సమయంలో మహిళలను భయభ్రాంతులకు గురి చేశామని , తప్పుడు కేసులు నమోదు చేశామని గత కొన్ని రోజులుగా పోలీసులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు . పోలీసుల మీద సామాజిక మాధ్యమాల్లో అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు