పెద్దపల్లి సెప్టెంబర్ 29
గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకోవద్దనీ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు సూచించారు. బుధవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గంజాయికి అలువటుపడ్డ వారి తల్లిదండ్రులను పిలిపించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేయడం జరిగింది. అనంతరం వారిని బైండోవర్ చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతూ గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కుటుంబ బాధ్యత లేక చదువు లేక యువత గంజాయికి అలవాటు పడి ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితిలో నేరాలకు పాల్పడి జీవితాలు జైలుపాలు చేసుకుంటున్నారని,
కొంతమంది యువత గంజాయి మత్తుకు అలవాటు పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతూ నేరస్థులుగా మారుతున్నారన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలు బానిసలు కావద్దని ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.కష్టపడి చదివి ఏదో రంగంలో ఉద్యోగం సాధించి జీవితాలను చక్కదిద్దుకోవాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా గంజాయి, పేకాట, గుట్కా తదితర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదు జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. మరియు గంజాయి, గుట్కా ఎవరైనా గ్రామాలలో అమ్మిన, ఇతరుల వద్ద నుండి కొనుగోలు చేసిన, రవాణా చేసిన ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి త్రాగేవారు వారు అమ్మేవారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం గంజాయి త్రాగే 9 మందిని రామగుండం ఎమ్మార్వో ముందు హాజరు పరిచారు. కార్యక్రమంలో 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఏఎస్సై మల్లయ్య, కానిస్టేబుల్స్ తీట్ల శ్రీనువాస్, వెంకటేష్, హేమసుందర్ పాల్గొన్నారు.