Home ఆంధ్రప్రదేశ్ అంబెద్కర్ భవనానికి నిధులు ఇవ్వండి

అంబెద్కర్ భవనానికి నిధులు ఇవ్వండి

143
0

నెల్లూరు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట లోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, బారాషాహీద్ దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నెల్లూరు రూరల్ లో షాదీ మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, రూరల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మంచినీటి పధకం కోసం ద్వంసమైన రోడ్లు పునర్నిర్మించాలని, ఇది కాకుండా రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు.  రెండు నెలలో ద్వంసమైన రోడ్లను పునర్నిర్మిస్తామని, మిగిలిన పనులకు కూడా నా వంతు సహకారం అందిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ హమినిచ్చారు.   ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం, ప్రజల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు.

Previous articleకౌలు రైతుల‌ను ప‌ట్టించుకుంటే అస‌లు రైతుల‌కే మోసం కౌలు అనేది ప్ర‌యివేటు వ్య‌వ‌హారం కౌలుదారు మారినప్పుడ‌ల్లా రికార్డుల‌ను మార్చాలంటే కుద‌ర‌దు కౌలు రైతులు న‌ష్ట‌పోతే.. త‌ప్ప‌కుండా ఆదుకుంటాం శాస‌న‌స‌భ‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక వ్యాఖ్యలు
Next articleపిల్లిగుండ్ల గ్రామస్తులు వైసీపీ ని వీడి 100 మంది టిడిపి పార్టీలో చేరిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here