నెల్లూరు
ఉన్నత చదువులు చదువు కోవాలి అనీ తపన పడుతున్న పేద విద్యార్థులకు దాతలు దయతో శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి ద్వారా చేయుతను అందిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య వెల్లడించారు. కోటలోని శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి కార్యాలయంలో మండల కేంద్రమైన వాకాడు గ్రామానికి చెందిన దువ్వూరు రమణయ్య కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్న దువ్వూరు హరిప్రసాద్ కు 42 వేల రూపాయలు విలువ కలిగిన ల్యాప్ టాప్ నుసమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులకు దాతల దాతృత్వాన్ని అందిపుచ్చుకుని తమ సంస్థ ద్వారా అన్నీ రకాలుగా చేయూతను అందిస్తున్నాము అనీ ఆయన చెప్పారు. వాకాడు గ్రామానికి చెందిన దువ్వూరు హరిప్రసాద్ విద్యానగర్ ఎన్ బి కె ఆర్ ఇంజినీరింగ్ కళాశాలో ఐ ఎస్ టి మొదటి సంవత్సరం చదువుతున్నారు అనీ, ఆ విద్యార్థికి ల్యాప్ టాప్ అవసరం అయ్యిందని, కానీ పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ సంస్థను సంప్రదించడంతో దాతల సాయంతో ల్యాప్ టాప్ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోశ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి ప్రతినిధులు పెళ్ళరు కోటేశ్వరరెడ్డి, మండిగ నవకోటి, గుర్రం అశోక్ కుమార్, దువ్వూరు రమణయ్య,అల్లం సాయి రామ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.