నెల్లూరు
నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేట మండలం లోని దామనెల్లూరు, మంగనెల్లూరు, మంగళపాడు సచివాలయాలను జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆమె ఆయా ప్రాంతాలలోని సచివాలయాల రికార్డులను పరిశీలించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సచివాలయం పరిధిలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు 100 శాతం నిర్వహించాలని, స్పందన కోవిడ్ 19 కేసులపై విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.