నెల్లూరు
నెల్లూరు జిల్లా,
కొడవలూరు మండలం లో పలు గ్రామ సచివాలయలలో ఒక పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా తలమంచి, నార్త్ రాజుపాలెం -2 సచివాలయంలను జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. సచివాలయం పరిధిలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల్లో సచివాలయాల నిధులపై నమ్మకం కలిగేలా తమ వంతు సేవలు అందించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగుల అందరిపై ఉందన్నారు. విధినిర్వహణలో ఎటువంటి తప్పటడుగులు వేసిన ను, అటువంటి వారిపై చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు 100 శాతం నిర్వహించాలని, స్పందన, కోవిడ్ 19 కేసులపై విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.