Home ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మృతి

డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మృతి

86
0

కర్నూలు
రాయలసీమ రాజకీయ కురువృద్ధుడు మొదటి తరం రాయలసీమ ఉద్యమ నాయకుడు 1983 – 84లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో “రాయలసీమ కరువు బండ” పేరుతో రాయల సీమకు నికర జలాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి కర్నూల్ లోని మెడికల్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ పరమపదించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గా పని చేస్తూ వైద్య వృత్తి లో కొనసాగుతూ పీడిత ప్రజల తరపున న్యాయ పోరాటం చేయడానికి న్యాయ విద్య అభ్యసించి కోర్టులో వాదించి నటువంటి గొప్ప మానవతావాది. అదేవిధంగా డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి మంచి కవి రచయిత వారు రచించిన రచనలలో సినిమా స్వర్ణయుగం,ప్రపంచ చరిత్ర- 4 భాగాలు బహుళ ప్రజాదరణ పొంది వున్నాయి.అదే విదంగా రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకం అనేక సార్లు పునరముద్రాన జరిగి రికార్డ్ స్థాయి లో అమ్ముడు పోతూనే వుంది..Dr. MV రమణ రెడ్డి బహుముఖ ప్రజ్ఞశాలి. ఎన్నడూ ఆడంబరాలుకీ పోనీ వ్యక్తి. ఈనాటి రాయలసీమ మలితరం ఉద్యమకారులకు ఒక చుక్కని…మార్గదర్శి. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసి చివరి క్షణం వరకు ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి దీర్ఘకాలం ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం ఏడు గంటలకు కర్నూలు మెడి కవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరమపదించారు విషయం తెలుసుకున్న వెంటనే రాయలసీమ ఉద్యమ కారులు హుటాహుటిన మెడి కవర్ హాస్పిటల్ కి చేరుకొని వారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. రాయలసీమ ఉద్యమ కారులు అయినటువంటి రాయలసీమ జనార్ధన్, వివి నాయుడు ఖానాపురం కృష్ణారెడ్డి, విద్యార్థి నాయకులు సీమ కృష్ణ రవి, రంగముని సురేందర్ రెడ్డి శేఖర్ తదితరులు డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి నింగికెగిసిన నేల తార అనీ ఎప్పటికీ ఆ నీలాకాశంలో ఉంటూ రాయలసీమ ఉద్యమకారులకు చుక్కానిగా ఉంటరని అన్నారు. ఉద్యమం ఒక పెద్ద దిక్కు ను కోల్పోయింది అనీ రాయలసీమ నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాయలసీమ జనార్ధన్  అన్నారు.

Previous articleక‌ళ్యాణ్ దేవ్, SRT ఎంటర్టైన్మెంట్స్ ‘కిన్నెర‌సాని’ చిత్రం నుంచి పార్వతిపురం పాట విడుదల..
Next articleఅన్నవరం దిగువ ఆపచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here