Home తెలంగాణ ఎట్టకేలకు బోడుప్పల్ మునిసిపల్ సూరజ్ నగర్ లో ప్రారంభమైన డ్రైనేజీ పనులు

ఎట్టకేలకు బోడుప్పల్ మునిసిపల్ సూరజ్ నగర్ లో ప్రారంభమైన డ్రైనేజీ పనులు

273
0

హైదరాబాద్ అక్టోబర్ 22
ఎంతో కాలంగా  బోడుప్పల్ మునిసిపల్ పరిదిలోని 15 వార్డ్ బొల్లిగూడెం లోని సూరజ్ నగర్  కాలనీలో ఎట్టకేలకు డ్రైనేజీ, పనులు ప్రారంభామైనాయి.ప్రధాన రోడ్డు డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ గౌడ్ శుక్రవారం  శంకుస్థాపన చేసి డ్రైనేజీ పనులు ప్రారంభించారు. బోడుప్పల్ లోని అన్ని కాలనీ ల కంటే బొల్లిగూడెం రిచ్ కాలని అని పేరు పొందినప్పటికీ  లోని కాలనీ లు అభివృద్ధి లో  మరియు  డ్రైనేజీ, రహదారులు, పార్కులు, అన్నింటిలో వెనుకబడి పోయింది. కాలనీలో దాదాపు 90 శాతం మంది విద్యావంత్తులు కావడం విశేషం. పండితుని కొడుకు పరమ శుంట అన్నట్లు, అంగట్లో అన్ని ఉన్న అల్లుడినోట్లే శని అన్నట్లు పేరుకే రిచ్ కాలని అయినా సౌకర్యాలు మాత్రం అరక్కోర అని చెప్పవచ్చు. ఈ కాలానికి  కార్పొరేటర్ గా కొత్త దుర్గమ్మ గౌడ్ ఎన్నిక కావడం తో కాలని సమస్యలు కళ్ళారా చుసిన ఆమె  దీనిని   ఒక పెద్ద ఛాలెంజ్ తీసుకొని  నేడు డ్రైనేజీ,  పనులకు శంకుస్తాపన చేసారు. ఈ సందర్బంగా దుర్గమ్మ గౌడ్ మాట్లాడుతూ తన వార్డ్ లో సూరజ్ నగర్ అంటే తనకెంతో ఇస్టమని అన్నారు.తనపట్ల కాలని ప్రజలు చూపించే ఆదరాభి మానాలు తననెంతో ముగ్డురాలిని చేశాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో కొన్ని అడ్డంకులు ఎదురు కావడం వల్ల కొంత ఆలస్యం అయినా కూడా ఈరోజు ఈ కాలనీ లో డ్రైనేజీ పనులు ప్రారంభం కావడం తనకెంతో సంతోశంగా ఉందన్నారు..మొదటగా కాలనీ ప్రధాన రహదారి తరువాత కాలనీ లో 13 వీధులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని ఈ సందర్బంగా కార్పొరేటర్ హామీ ఇచ్చారు. అనంతరం కాలని ప్రసిడెంట్ రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయం లో మన కాలనీ లో పెండింగ్ పనులను అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఈరోజు డ్రైనేజీ పనులు ప్రారంభించిన మన 15 వార్డు కార్పొరేటర్ అయినా కొత్త దుర్గమ్మ గౌడ్ ,కొత్త కిషోర్ గౌడ్ ఇందుకు సహకరించిన  వారికి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. కాలని ప్రజల  గత కొన్ని సంవత్సరాల కళ, నిరీక్షణ ఈ రోజు ఫలించి డ్రైనేజీ పనులు మొదలు అవ్వటం చాలా సంతోశముగా ఉందన్నారు. పనులు ఇక ఆలస్యము కాకుండా డ్రైనేజీ వ్యవస్థ కాలనీ మొత్తము అతి త్వరలో అందుబాటులోకి రాగాలదన్న ఆశబావాన్ని వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో కాలని అడ్వైజర్ మహేశుని లక్ష్మయ్య నేత, రవిచంద్ర, దేవేందర్, వెంకటేశ్వరులు,శేకర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleఎమ్మెల్యే ఆనం ఆధ్వర్యంలో వెంకటగిరిలో జనాగ్రహ దీక్ష
Next articleఅయిదు సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ రెబల్‌స్టార్ ప్ర‌భాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here