Home ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం

అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం

339
0

విజయవాడ
శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సోమవారంనాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ ఉదయం 4గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరించింది.  చేతిలో రసపాత్రను ధరించి ఎరుపు, పసుపు, నీలం రంగు దుస్తుల్లో చవితి నాడు అమ్మ అన్నపూర్ణాదేవిగా కొలువుదీరుతుంది.  ఆదిభిక్షువైన ఈశ్వరుడికి బిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. అక్షయ శుభాలను అందించే ఈ తల్లి, తనను కొలిచేవారికి ఆకలి బాధను తెలియనివ్వదంట.  అన్నపూర్ణగా దర్శనమిచ్చే కనకదుర్గ అమ్మవారిని ఈ రోజున తెల్లని పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

Previous articleతెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది పవన్‌ కల్యాణ్‌
Next articleహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here