నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థకు ఈనెల 15వ తేదీనా జరిగే ఎన్నికల నేపద్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని పలు డివిజన్లకు చెందిన టిడిపి సానుభూతి పరులు, నేతలు వైసిపిలోకి చేరిపోతున్నారు. తాజాగా 52వ డివిజన్ టిడిపి మైనార్టీ నేత షేక్ మహబూబ్ బాషా, 54వ డివిజన్ కు చెందిన టిడిపి నేతలు జంషీద్, షమీమ్, ఉమర్, ఆబీద్ లు వారి మిత్ర బృందాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే 15వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్ధి షేక్ పర్వీన్ కూడా మంత్రి సమక్షంలో వైసీపిలో చేరారు.