Home తెలంగాణ రౌడీ షీటర్ ల కదలికల పై డేగ కన్ను – సత్పరివర్తన కలిగి ఉండాలి...

రౌడీ షీటర్ ల కదలికల పై డేగ కన్ను – సత్పరివర్తన కలిగి ఉండాలి – ప‌ద్దతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ తప్పదు – రౌడీ షీటర్లకు హెచ్చరిక రామగుండం సీపీ చంద్ర శేఖర్ రెడ్డి

235
0

పెద్దపల్లి  అక్టోబర్ 07

గతంలో నేర చరిత్ర కలిగి ఉన్న వారు సత్ప్రవర్తన కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ డివిజన్ పరిధిలో ఉన్న షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవించడానికి సదరు వ్యక్తులంతా ఏయే వృత్తుల్లో ఉన్నారు అనే విషయాలను సీపీ అడిగి తెలుసుకొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు ఎటువంటి శాంతి భద్రతల సమస్య సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు బానిసలై కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని వారిపై కూడా చట్ట పరమైన చర్యలు చేపడతామన్నారు. సరైన నడవడికతో ఉండాలని ఎలాంటి ఆసాంఘీక కార్యకలాపాలు చేయుద్దని హెచ్చరించారు. నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బెదిరింపులకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సరైన నడవడికతో ఉండాలని ఎలాంటి ఆసాంఘీక కార్యకలాపాలు చేయుద్దని హెచ్చరించారు. గతంలో నేర చరిత్ర కలిగి ఉండి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై  షీట్లు ఓపెన్ చేయడం జరిగిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారితోపాటు రౌడీయిజం, భూకబ్జాలకు పాల్పడేవారు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడేవారిపై షీట్లు నమోదు చేశామన్నారు. గిరి కదలికలపై ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది డేగ కన్ను వేశామని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచూ నేర చరిత్ర కలిగి ఉండి షీట్లు నమోదైన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో గతంలో నేరాలకు పాల్పడిన 226 మంది  షీట్లు ఓపెన్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేన రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్సై రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు

Previous articleమానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య నేటి యువతకు ఆదర్శం 6వ సారి రక్తదానం
Next articleమామిడి తోరణాలు లేవు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here