అమలాపురం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో పాడైన గుడ్లను పిల్లలకు ఆహారంగా పెడుతున్నారు. కనీసం పాఠశాల ఉపాధ్యాయులు కూడా పట్టించుకోని పరిస్థితి. గుడ్లు బాగా నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతుంది.. అయినా పిల్లలకు అవి పెట్టడంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంట్రాక్టర్ల్ కనీసం విద్యాశాఖ శాఖ అధికారులు పర్యవేక్షణ కరువైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతుంటే మరో పక్క అధికారులు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కల్తీ ఆహారాన్ని పిల్లలకు పెడుతూ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి.