కౌతాళం
మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల నాయకులు దేశాయ్ కృష్ణ సహకరిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ లబ్ధి పొందేలా చూస్తానని గ్రామ సమస్యలు పరిష్కారానికి దోహద పడుతానని ఎంపీటీసీ 2 హసీనా, వారి భర్త రాజ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రమాణస్వీకారోత్సవ సమావేశంలో హాజరై ఎంపీడీవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలో 22 ఎంపిటిసిలు గాను ఇరవై వైసిపి ఎంపీటీసీ కైవసం చేసుకొని ప్రమాణస్వీకారోత్సవం లో ఎగరపథం వేశారు..చిరుత పల్లి గ్రామంనుంచి బిజెపి ఉరుకుంద గ్రామంనుంచి రెబల్ ప్రమాణ స్వీకరం చేశారు.అనంతరం ఎంపిటిసి లకు శాలువా కప్పి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఉత్సవాల్లో మండల నాయకులు దేశయి కృష్ణ ,ఎంపీటీసీ బుజ్జి స్వామి, ఎంపిటిసి అనిత ,మాజీ సర్పంచ్ అవతారం, సర్పంచ్ పాల్ దినకర్,తిక్కయ్య, వడ్డే రాముడు మరియు కార్యకర్తలు బారి ఎత్తున హాజరయ్యారు.