విశాఖపట్నం
అరకులోయ మండల కేంద్రంలో గల పర్యాటక శాఖ హరిత వ్యాలీ రిసార్ట్స్ ప్రారంగణంలో ఎమ్మెల్యే చెట్టి.ఫాల్గుణ నేతృత్వంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ అభినందన సభ ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా ఎమ్మెల్యే ముందుగా సభను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న రాజ్యంలో కష్టపడిన వారందరికీ పదవులు ప్రతిఫలం రెండు ఉంటుంది.దీనికి ఉదాహరణగా రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శతక.బుల్లిబాబు జీసీసీ చైర్ పర్సన్ శోభ.స్వాతిరాణి అందుకు ఉదాహరణకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా.రవిబాబు ఆదివాసీ ముద్దుబిడ్డ అరుకు ఎంపీ గొడ్డేటి.మాధవి అలాగే జిల్లా జెడ్పి చైర్ పర్సన్ అరబీరు.సుభద్రతోపాటు అందులో నేనుకూడా అని అన్నారు.రాజన్న రాజ్యంలో మేమంతా సైనికులుగా ప్రజల సేవలు చేసేందుకు ఎల్లప్పుడూ.. ఉంటామని తెలిపారు.రాజకీయంలో ఎన్నో మంచి పనులు చేసిన వ్యతిరేకించే వాళ్లు చాలామంది ఉంటారు.రాముడంతటి వాడే రావణశూరుడికి నచ్చలేదు.నా ముందున్న లక్ష్యం..ఆటుపోట్లు ఎదురైన వెన్నుపోటు తగిలిన అరుకు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను శాశ్వతంగా ఎగురవేయలన్నారు.అలాగే అరకు నియోజకవర్గం మరో పులివెందులగా చేయాలని నా జీవిత ఆశయన్నారు.కుంభా.రవిబాబు జీవితం అద్భుతం పార్టి జెండా మోసి పని చేసినందుకు ముఖ్యమంత్రి గొప్ప పదవి బాధ్యతలు అప్పజెప్పారన్నారు.అలాగే భవిష్యత్ లో గవర్నర్ పదవి చేపట్టాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్న మన్నారు.అలాగే ప్రభుత్వ వెబ్ సైట్లలో తొలగించిన గిరిజన ఉప తెగలైన వాల్మీకి భగత గౌడు తెగల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే కొల్లపుట్టు భూ వివాదం పరిష్కరించాలని తెలిపారు.అనంతరం ఎస్టీ కమిషన్ చైర్మన్ కు పూలమాలలు వేసి దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అరుకు ఎంపీ గొడ్డేటి.మాధవి రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ శతక.బుల్లిబాబు జీసీసీ ఛైర్ పర్సన్ శోభ.స్వాతిరాణి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళీ.భాగ్యలక్ష్మి జిల్లా జెడ్పి చైర్ పర్శన్ సుభద్ర వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి. గంగాధర్ స్వామి మండల అధ్యక్షుడు కొర్రా.గాసి జెడ్పిటిసిలు రోషిణి కూడా.బొంజుబాబు గుమ్మకోట సర్పంచ్ అప్పారావు ఎంపిటిసి సుమాంజలి విజయ ఆనంద్ భీంరాజు పద్మపురం సర్పంచ్ సుస్మితతోపాటు ఆరు మండలాల జెడ్పిటిసిలు ఎంపిటిసిలు సర్పంచ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జెలి చిరంజీవి కించుమండ ఎంపీటీసీ గుజ్జెలి విజయ సూపర్ సర్పంచ్ జాన్ విన్సెంట్ సాకరి మధు సాకరి పెద్ద భీమన్న పెట్టెలి సుంక్ర హరిబారికి అప్పలరాజు హరిబారికి రాంనాయుడు హెచ్ బి.గాసినాయుడు మహంతి కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.