జమ్ముకశ్మీర్ అక్టోబర్ 28
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న ఓ మినీబస్సు మార్గమధ్యలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా, ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్‌ుల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున్న ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. అదేవిధంగా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కూడా మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది.