నెల్లూరు
ముత్యాల పాడు లో ఈ నెల 13 అర్థరాత్రి దయాకర్ అనే యువకుని హత్యకేసును గూడూరు పోలీసులు చేధించారు. కేసులో పిర్యాదు దారు అయిన సొంత అన్నే ముద్దాయిగా తేల్చారు. ఎటువంటి ఆధారాలు లేని చోట కొన్ని సూక్ష్మ ఆధారాలతో కేసును ఛేదించిన గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కి మేరిటోరియస్ సర్వీస్ ఎంట్రీ సిఫార్సు చేసారు. కోట మండలం లక్ష్మక్క కండ్రిగ గ్రామానికి చెందిన కాకు దయాకర్ కు ధనుంజయ అనే ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు, పదిహేను సంవత్సరాల క్రితమే దయాకర్ ను పని నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగానికి దయాకర్ అన్న ధనుంజయ పంపాడు. కొన్ని రోజులు తర్వాత ఉద్యోగం మానేసి దొంగతనాలకు అలవాటు పడిన దయాకర్ తాళాలు వేసిన ఇళ్ళలో చోరీలు చేస్తూ వుండడం తో హైదరాబాద్ లో అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. దొంగతనం జరిగిన ప్రతిసారి హైదరాబాద్ పోలీసులు లక్షక్క కండ్రిగ అయిన తమ గ్రామంలో తమ ఇంటి కి వచ్చి విచారణ చేస్తూ వుండడం అవమానంగా భావించిచాడు. తరువాత దయాకర్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాక దయాకర్ ని నెల్లూరులో వాళ్ళ బంధువులు ఇంటిదగ్గర ఉంచాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి దొంగతనాలకు పాల్పడుతుండడం, ఈ లోపు వాళ్ళ చెల్లెలుకు పెళ్ళి కుదరడం ఈ క్రమంలోనే తమ్ముడు దయాకర్ తో అన్న ధనుంజయ చెల్లి పెళ్ళి కుదిరింది ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. దయాకర్ కొన్ని ఇబ్బందికరమైన మాటలు అనడంతో ఇంక దయాకర్ మారడు అనే ఉద్దేశ్యంతో ఎలాగైనా తమ్ముడిని కడ తీర్చాలి అనే ఉద్దేశముతో ముత్యలపాడు లోని బంధువుల ఇంటికి పంపి ఆరోజు రాత్రి హత్యకు పధకం రచించాడు. పధకం ప్రకారం మూత్యాలపాడు కు కారు లో వచ్చి కారును వూరి చివర మాతమ్మ గుడిదగ్గర వుంచాడు. మేడమీద నిద్ర పోతున్న దయాకర్ ని కత్తితో మెడ మీద పొడిచినట్టు,తర్వాత హత్యా సమయంలో హత్యకు ఉపయోగించిన కత్తి, వేసుకున్న దుస్తులు తీసి ఇంట్లోని బ్యాగ్ లో పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉదయం ఏమి తెలియని వాడిలా తన తమ్ముడుని ఎవరో చంపేశారని చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దగ్గరుండి తమ్ముడి పోస్టుమార్టం పూర్తి చేశాక కర్మక్రతువులు నిర్వహించడం చేశాడు. పోలీసులు ఇంట్లో వారిని విచారిస్తున్న సమయంలో ఒకరికి ఒకరు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం కలిగి ధనుంజయ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడం తో అనుమానంతో లోతుగా విచారణ చేయగా ముద్దాయి విచారణలో హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియచేశాడని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలియచేశారు.
ధనుంజయ తో పాటు బావమరిది ముద్దాయిగా మారిన వైనం
హత్య తర్వాత ఉదయం గూడూరు లో తమ్ముడి పోస్ట్ మార్టం దగ్గర వున్న ధనుంజయ పోలీసులు డాగ్ స్క్వాడ్ తీసుకు వస్తే దొరికి పోతానేమో అనుకుని శ్రీ కాళహస్తిలోని తన బావ మరిది అయిన ప్రదీప్ కి ఫోన్ చేసి కత్తిని, బట్టల్ని ఇంట్లో పెట్టి ఉన్నానని వాటిని పక్కనే వున్న కాలువలో పడేయమని చెప్పడంతో ప్రదీప్ లక్షమ్మ కండ్రిగ కి వెళ్లి ఆ వస్తువులను కాలవలో పడేసాడు. దాంతో ప్రదీప్ కూడా ముద్దాయిగా మారాడు. ముద్దాయిల ను మంగళవారం రాత్రి బోదనం టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసారు.