కడప
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం, చాకిబండి కు చెందిన అక్కా తమ్ముడు వండాడి (చెరువు) వద్ద మాండవ్య నదిలో మునిగి మృతిచెందారు.మృతులు అక్క షాజియా (16) , తమ్ముడు సాజీర్ (11). తండ్రి షేక్ అమీర్ భాషా తో కలసి రాయచోటి లోని ఒక శుభకార్యానికి చిన్నారులు వెళుతూ వాండాది వద్ద వాగు దాటుతుండగా ఘటన జరిగింది. వరద ఉధృతికి అక్కా, తమ్ముడు కొట్టుకుపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమీర్ భాష చిత్తూరు జిల్లా కలకడలోని తన బంధువుల ఇంట్లో జరిగే శుభ కార్యానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనం పై వండాడి వైపు వెళ్తుండగా వండాడి సమీపంలోని మాండవ్య నదిపై ఉన్న బ్రిడ్జి పై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డున ద్విచక్ర వాహనం నిలిపి తన పిల్లలతో నడుచుకుంటూ వాగు దాటే క్రమంలో ప్రమాదశాత్తు వరద ఉధృతి కి కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో అమీర్ బాష ప్రాణాలతో బయట పడ్డాడు. విషయం తెలుసుకున్న రాయచోటి రూరల్ సిఐ లింగప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వరద నీటిలో గల్లంతైన అక్కా, తమ్ముడు మృతదేహాలను గుర్తించి వెలికితీసి సీఐ లింగప్ప స్వయంగా డు సాజీర్ మృతదేహాన్ని తన భుజాల పై మోసుకొచ్చి ఒడ్డున చేర్చి మానవత్వం చాటుకున్నారు.