బద్వేలు, అక్టోబర్ 23
బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. నిశ్చల్, ఐ.ఆర్.ఎస్., (ఐ. టి.) గారు శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం బద్వేలు తహసీల్దార్ కార్యాలయం చేరుకొని బద్వేలు ఉప ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు.. జిల్లాకు రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 124 బద్వేలు ( ఎస్సి) నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థుల వ్యయ ఖర్చుల పై సహాయ వ్యయ పరిశీలకులు శ్రీధర్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. వ్యయ ఖర్చులు సంబంధించి తగు సూచనలు చేసి రికార్డ్ లను ఎప్పటికప్పుడు నమోదు చేయవలసిందిగా ఆదేశించారు.