విజయవాడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. మరోసారి ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఏపీ వ్యాప్తంగా 13 చోట్ల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ విడుదల చేసింది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అలాగే 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటూ బుచ్చిరెడ్డిపాలెం ఆకివీడు జగ్గయ్యపేట కొండపల్లిలో ఎన్నికలు జరుగుతాయి. గురజాల దాచేపల్లి దర్శి కుప్పం బేతంచెర్ల కమలాపురం రాజంపేట పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు ఉన్నాయి.. 533 వార్డులు 85 ఎంపీటీసీలు 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 14 1516 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్ అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్ 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్ 18న కౌంటింగ్ జరపనున్నారు.కోర్టు కేసులు మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఎన్నికలు ఎన్నికల సంఘం తాజాగా కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాన్ని అందుకుంటోంది. మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపును అందుకుంది. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీ ఈసారైనా పరువు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.