Home తెలంగాణ మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య నేటి యువతకు ఆదర్శం 6వ సారి రక్తదానం

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య నేటి యువతకు ఆదర్శం 6వ సారి రక్తదానం

126
0

కామారెడ్డి అక్టోబర్ 07

కామారెడ్డి జిల్లా కేంద్రం భిక్ నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించడంతో బిబీపేట మండలం రామ్ రెడ్డిపల్లి కి గ్రామానికి చెందిన లావణ్య కు తెలియజేయగానే ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా  బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి లావణ్య ఎంతో ఆదర్శమని  35 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రక్తదానం చేయడం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది అన్నారు. గతంలో కూడా 5 సార్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు లావణ్య ను స్ఫూర్తిగా తీసుకొని ఆపద సమయంలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన లావణ్యను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్,రాజు, పాల్గొనడం జరిగింది.

Previous articleస్టేట్ బ్యాంకు రుణ మేళాను సింహపురి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
Next articleరౌడీ షీటర్ ల కదలికల పై డేగ కన్ను – సత్పరివర్తన కలిగి ఉండాలి – ప‌ద్దతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ తప్పదు – రౌడీ షీటర్లకు హెచ్చరిక రామగుండం సీపీ చంద్ర శేఖర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here