కోరుట్ల అక్టోబర్ 06
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ముస్లిం సంక్షేమం కోసం
మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, ప్రతి ఏటా రూపాయలు 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు ఏఆర్ అక్భర్, నాయింలు డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలిలో మంగళవారం మైనారిటీ సమస్యలపై కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడటం పట్ల కోరుట్ల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకులు ఏఆర్ అక్భర్,నాయింల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఆర్ అక్భర్,నాయిం లు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం ముస్లిం, మైనార్టీలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి పోయారని ,వారికి ప్రత్యేక ఉపాధి కల్పన లాంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ హాయంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మైనారిటీల సంక్షేమానికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పంచ్చినప్పటికీ కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ 4 శాతానికి పరిమితమైందని గుర్తు చేశారు. అప్పటికి నాలుగు శాతం రిజర్వేషన్లుతో ప్రస్తుతం విద్యా ,ఉద్యోగ ,రంగాల్లో రాజకీయాలలో ముస్లిం మైనారిటీలు రిజర్వేషన్ పొందుతున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మైనార్టీలకు 4 శాతం నుండి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని తెరాస రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మరిచిందన్నారు.ముస్లిం మైనారిటీ లకు 12 శాతం రిజర్వేషన్లు ఆంశంలో రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం సహకారంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుతుందని ఆన్నారు. ముస్లిం ఉపప్రణాళిక అమలు కోసం ప్రతి సంవత్సరం రూపాయలు 10 వేల కోట్ల నిధులు కేటాయించిన డిమాండ్ చేశారు. మైనారిటీ ముస్లింలకు ఎలాంటి సబ్సిడీ రుణాలు ప్రభుత్వ ద్వారా అందలేదన్నారు.ఇప్పటికైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ,అలాగే మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూపాయలు 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ,మైనారిటీ యువతకు ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షుడు ఎండి.నాయిం,
జిల్లా కిసాన్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్,యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్,మాజీ కౌన్సిలర్ సోగ్రాభి,మాజీ పట్టణ అధ్యక్షుడు ఏఆర్ అక్బర్,నాయకులు తుపాకుల భాజన్న,ఎండి.రహీం,ఎండి.నసీర్, ఎండి జమీల్ ,సయ్యద్ రహీం,ఎండి.యూసుఫ్,
షోహెల్,ఫాక్రోద్దీన్,యాకుబ్, అన్వర్,ముజామ్మీల్, రిజ్వాన్, తైసీన్ ,ఆదిల్,అజ్జు, నిజాం,ఆర్షద్
అహ్మద్, ఫాయిజ్ ,నవీద్ ,ఇసాక్ ,మూజాహీద్ తదితరులు పాల్గొన్నారు.