అమరావతి నవంబర్ 12
రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి సంకోచాలు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులకు 7 డీఏలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామన్న మాట తప్పారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని రామకృష్ణ అన్నారు