మందమర్రి.నవంబర్ 16
ఉద్యోగులు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని ప్రతి ఒక్కరు నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆర్కే 6 గని మేనేజర్ సంతోష్ కుమార్ సూచించారు.మంగళవారం సింగరేణి నాణ్యత వారోత్సవాలను పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గని ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో గని మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి కి మన వంతు కృషి చేయాలని ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ సారథ్యంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, రవాణా, అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది అని అలాగే శ్రీరాంపూర్ ఏరియా జిఎం సురేష్ ఆధ్వర్యంలో మన ఏరియా ముందుకు సాగుతుందని వారు తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు దీటుగా సింగరేణి సంస్థ కూడా తన బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వారు తెలియజేశారు. అలాగే విద్యుత్ సంస్థల పురోగతి మనం సరఫరా చేసే నాణ్యమైన బొగ్గు పైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలని అన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు తనవంతు కృషిగా గనిలో బొగ్గు నింపే సందర్భంలో బొగ్గు,బండ వేరుచేసి నింపాలని ఆయన కోరారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ఉద్యోగులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులతో నాణ్యత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి కాదాసి శ్రీనివాస్, ఫిట్ ఇంజనీర్ ఆండే శ్యామ్ కుమార్, ఇంజనీర్ మహేష్, డిప్యూటీ మేనేజర్స్ రాం నర్సయ్య,మర్రి కొమరయ్య, సంక్షేమ అధికారి కె సునీల్ కుమార్ గుర్తింపు సంఘం నాయకులు చిలుముల రాయమల్లు, ఫిట్ సెక్రెటరీ ఇప్ప భూమయ్య, గని ఉద్యోగులు పాల్గొన్నారు.