Home ఆంధ్రప్రదేశ్ రేబీస్ ను అంతమొందించాలి

రేబీస్ ను అంతమొందించాలి

316
0

కడప సెప్టెంబర్ 29
కడప పాతిమామెడికల్ కాలేజ్ లో.. రేబీస్ వ్యాధి సోకిన జంతువుల కాటు వలన లాలాజలం ద్వారా ఈ వ్యాధి సంభవిస్తుంది అని దీనిని జలభీతి వ్యాధి అని కూడా ఆంటామని ఫాతిమా వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ జయరామిరెడ్డి అన్నారు. ఈనెల 28 వ తారీఖున ప్రపంచ రేబీస్ దినోత్సవము నకు అనుసంధానం గా ఈ నెల 29 వ తారీఖున ఫాతిమా వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వారు నిర్వహించిన సమావేశానికి కళాశాల డైరెక్టర్ డాక్టర్ జయరామిరెడ్డి అధ్యక్షత వహించారు ఈ సందర్భముగా డాక్టర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ రేబీస్ అనే వ్యాధి కుక్కలు, పిల్లులు, కోతులు, గబ్బిలాలు, నక్కలు, తోడేళ్ళు మరియు ఎలుగు బంట్ల ద్వారా సంక్రమిస్తుంది అని ఈ వ్యాధి మానవులతో సహా అన్ని క్షీరదాల మెదడు మరియు వెన్నుపామును ప్రభావితం చేసే భయంకరమైన లిస్సా  వైరస్ ఇన్ఫెక్షన్ అని, గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రేబీస్ మరణాలు దాదాపు 59 వేల మరణాలు సంభవిస్తున్నాయి అని మన దేశం లో దాదాపు 20 వేల రేబీస్ మరణాలు సంభవిస్తున్నాయి అని అందులో 15 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 40 శాతం ఉన్నారని డాక్టర్ జయరామి రెడ్డి తెలియ జేసారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో అధిక జ్వరం, స్థితి బ్రాంతి, మూర్చరావటం, ఆకస్మికంగా వణకటం, పాక్షిక పక్షవాతం, క్రాంతి వలన భయము, వేగ వంతమైన శ్వాస, అధిక కోపం మరియు చొంగ కార్చటము వంటివి లక్షణాలుగా గమనించవచ్చు అని ఈ వ్యాధి చివరి దశలో వ్యాధి సోకిన మనుషులు నీటికీ దగ్గరైనప్పుడు ఆదుర్దా మరియు భయాందోళలనలు వంటి అనుభూతులు కలిగి ఉంటారని ఈ దశలో అన్ని కీలక అవయవాల పనితీరు నెమ్మదిఇంచుట వలన చివరకు వ్యక్తి కోమా లోకి వెళ్ళటం మరణాలు సంభవిం చటం కొన్ని రోజుల్లోనే సంభవిస్తాయి అని కనుక ఏదైనా జంతువులు కరచిన వెంటనే భయపడకుండా 15  నిమిషాల పాటు సబ్బుతో కానీ లేక మెడికేటెడ్ ద్రావనాలతో శుభ్రపరచుకొని గుర్తింపు పొందిన వైద్యుల దగ్గరకు వెళ్లి   టేటనస్ తీసుకొని మరియు యాంటీ బయాటిక్స్ వాడుకుంటూ రేబీస్ టీకాలను ప్రణాళిక ప్రకారం వేయించు కోవాలి. పెంపుడు జంతువు లకు ఖచ్చితంగా రేబీస్ టీకాలు వేయించాలి, వీధిలో ఏదైనా జంతువు అనుమానాస్పదంగా ఉన్నా పిచ్చి పట్టినట్లు అనిపించినా వెంటనే సంభందిత మునిసిపాలిటి లేదా పంచాయతి అధికారుల దృష్టికి తీసుకుని పోవలెనని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచనల ప్రకారం రాబోవు 2030 సంవత్సరం కల్లా ఈ రేబీస్ ను ప్రపంచ వ్యాప్తంగా పారద్రోలడానికి అందరు సన్నద్ధం కావాలని డాక్టర్ జయరామిరెడ్డి  ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ సహా ఆచార్యులు డాక్టర్ చంద్ర శేఖర్,  సహాయ ఆచార్యులు డాక్టర్ ఉమా సుందరి, మెడికల్ సోషియల్ వర్కర్ సుబ్రమణ్యం, జూనియర్ వైద్యులు గౌస్, ఆయిష, రిషిక,  ఆసిఫ్, దావూద్, కరిష్మా, జునైద్, ఫిర్దొస్, అస్మా, ముబీనా, అజ్రా, షరీఫ్, కుబ్రా, ఖదీర్ లతో పాటు వైద్య విద్యార్థులు మరియు  సిబ్బంది పుష్ప లత, మల్లీశ్వరి తదితరులు పాలుగొన్నారు.

Previous articleభిన్న విశ్వాసాలకు చెందిన ప్ర‌జ‌ల మ‌ధ్య సత్సంబంధాల‌ విచ్ఛిన్నం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి ఆరోపణ
Next articleఅభివృద్దిలో జిల్లాను ఆదర్శంగా నిలపాలి జిల్లా కలెక్టర్ జి. రవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here