Home నగరం మానవ బంధాల గురించి తెలియజేసే ఎంట‌ర్ టైన‌ర్ ‘ప‌రిణ‌యం’.

మానవ బంధాల గురించి తెలియజేసే ఎంట‌ర్ టైన‌ర్ ‘ప‌రిణ‌యం’.

155
0

లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, పాత్ బ్రేకింగ్ వెబ్ షోస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ ఎంట‌ర్‌టైన్మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఛానెల్ ‘ఆహా’. ఇందులో హృద‌యానికి హ‌త్తుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌ ప‌రిణయం చిత్రం సెప్టెంబర్ 24న ప్రీమియ‌ర్ కానుంది. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో సురేశ్ గోపి, శోభ‌న కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పాపుల‌ర్ ఫిల్మ్ మేక‌ర్ స‌త్య‌న్ అంతిఖ‌డ్ త‌న‌యుడు అనూప్ స‌త్య‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. వ‌ర‌ణే అవ‌శ్య‌ముంద్ పేరుతో మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.
ఓ ఫ్రెంచ్ ట్యూట‌ర్‌, కుమార్తె నికితాతో జీవితం వెళ్ల‌దీసే సింగిల్ పేరెంట్ నీనా మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కింది. నికితాకు సరైన వ‌రుడిని వెతుక‌డంలో నీనా బిజీగా ఉన్న స‌మయాన, ఆమెకు త‌న ప‌క్కింటిలో ఉండే మేజ‌ర్ ఉన్ని కృష్ణ‌న్‌తో అనుబంధం ఏర్ప‌డుతుంది. మన‌సులో నికితా ప్రాథ‌మికంగా ఎంతో ఘ‌ర్ష‌ణ ప‌డుతుంది. ఈ క్రమంలో ఆమె మ‌రో వ్య‌క్తితో స్నేహం చేస్తుంది. అయితే అత‌నొక ఫ్రాడ్‌. మ‌రి నీనా పెళ్లి విష‌యంలో మ‌రో నిర్ణ‌యం తీసుకుంటుందా? మ‌రి కుమార్తె నికితా నుంచి ఆమె పెళ్లికి అంగీకారం దొరుకుతుందా? అనేదే సినిమా. ఎమోష‌న్స్‌, హ్యుమ‌ర్‌, రొమాన్స్ అంశాల క‌ల‌యిక‌గా ప‌రిణ‌యం సినిమా రూపొందింది
అల్ఫోన్స్ జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అలాగే ముఖేశ్ ముర‌ళీధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ, టోబి జాన్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన వారు అద్భుతంగా త‌మదైన పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. చ‌క్క‌టి హాస్యంతో మాన‌వ సంబంధాల‌పై అభిప్రాయాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. ఈ 2021లో ‘ఆహా’ క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తిగ‌ది దాటి, ది బేక‌ర్ అంద్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు వంటి బ్లాక్‌బస్ట‌ర్ చిత్రాలు, వెబ్ షోస్‌ను అందిస్తూ ‘ఆహా’ ప్ర‌తి ఒక తెలుగువారి ఇంట భాగ‌మైంది.

Previous articleబ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ.1.10 కోట్లు విరాళం
Next articleమెడికల్ షాప్ ఎదురుగా బైకును ఢీకొన్న లారీ బైక్ పై ఉన్న చిన్నారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here