మందమర్రి. సెప్టెంబర్ 09
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతతో కృషి చేయాలని దానిలో భాగంగా వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించాలని మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం సింగరేణి యాజమాన్యం పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిఎం చింతల శ్రీనివాస్ మట్టి గణపతి విగ్రహాలను స్థానిక సిఈఆర్ క్లబ్ లో ఉద్యోగులకు,పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలను చెరువులలో నదులలో నిమజ్జనం చేస్తే జలచరాలకు హాని కలుగుతుందని అంతే కాకుండా నీటి కాలుష్యం కూడా ఏర్పడుతుందని అన్నారు. కనుక అందరూ కూడా మట్టి విగ్రహాలనే పూజించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం గోపాల్ సింగ్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ.సత్యనారాయణ,పిఎం వరప్రసాద్, పర్యావరణ అధికారి ప్రభాకర్, సీనియర్ పిఓ సత్య బోస్, నర్సింహయ్య ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు.