కడప అక్టోబర్11
ప్రస్తుత మహమ్మారి కోవిడ్-19 వలన కూడా చాలామందికి తాత్కాలిక నిరుద్యోగం, పిల్లలు ఇంట్లోనే ఆన్లైన్ చదువులు, ఇతరులతో చాలా మటుకు సంబంధాలను లేకపోవటం ఎంతో మంది మానసిక ఆందోళనకు కారణమయ్యిందని ఫాతిమా వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ సహా ఆచార్యులు డాక్టర్ చంద్ర శేఖర్ అన్నారు. అక్టోబర్ నెల 10 వ తారీఖున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ను పురస్కరించుకొని ఈ నెల 11 వ తారీఖున మానసిక ఆరోగ్యం పైన కళాశాల వైద్య విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాలు ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి అని దీర్ఘకాలిక శారీరక సమస్యలు కొన్నిసార్లు మెడడుపైన ప్రభావం చూపుతాయి అని మానసిక సమస్యలు శారీరకం గా క్షీణింప చేస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటూ రోజులో ఒక గంట సేపు వ్యాయామం మరియు యోగాభ్యాసములు చేయవలెనని తీవ్ర ఉద్రేకాలు లోను కాకుండా, కుంగి పోకుండా ఉండాలి అని క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు తలమునకలు కాకుండా ధైర్యంగా పరిష్కరించు కోగలిగితే మానసిక వైకల్యానికి తావు ఉండదని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
ఈకార్యక్రమం లో కమ్యూనిటీ మెడిసిన్ సహాయ ఆచార్యులు డాక్టర్ ఉమాసుందరి, ట్యూటర్ కిరణ్మయి, మెడికల్ సోషియల్ వర్కర్ సుబ్రమణ్యం సిబ్బంది పుష్పలత, మల్లీశ్వరి తదితరులు పాలుగొన్నా రు.